|
Context
Song Context:
నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఓడడం అంతే! |
Song Lyrics
||ప|| |అతడు|
ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడమంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
||నిజంగా నెగ్గడమంటే ||
||ఆడించి అష్టా చమ్మా||
.
||చ|| |అతడు|
ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను ఏ లెక్కెలాగ తీసుకోను
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను
నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ల బాటలో
నీ దాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
||నిజంగా నెగ్గడమంటే ||
.
||చ|| |అతడు|
నా నేరం ఏముంది ఏం చెప్పిందో నీ తల్లో జేజమ్మ
మందారం అయ్యింది ఆ రోషం కాకే జళ్లో జాజమ్మ
పూవంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్లంటి కోపం ఒళ్లంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మ
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
No Comments »