Archive for the ‘చిన్ని ఆశలు - గొప్ప ఆశయాలు’ Category

హృదయాంజలి: మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Hrudayanjali
Singers
   Chitra, Chorus
Music Director
   A.R. Rahman
Year Released
   1998
Actors
   Vineeth, Sonali
Director
   K. Balu
Producer
   B. Satyam

Context

Song Context: చిన్ని ఆశలు - గొప్ప ఆశయాలు
                    (Simple pleasures and Great ambitions!)

Song Lyrics

||ప|| |ఆమె|
       మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం ||2||
       పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జో కొడుతుంటే ||2||
                                                    || మానస వీణ ||
.
||చ|| |ఆమె|
       పున్నమి నదిలో విహరించాలి
       పువ్వుల ఒళ్లో పులకించాలి
       పావురమల్లే పైకెగరాలి
       తొలకరి జల్లై దిగిరావాలి
       తారల పొదరింట రాతిరి మజిలీ
       వేకువ వెనువెంట నేలకు తరలి
       కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలి
                                  || మానస వీణ ||
.
||చ|| |ఖోరస్|
       దూకే వాగు నా నేస్తం
       చెలరేగే వేగమే ఇష్టం
       అలలాగే నింగికే నిత్యం ఎదురీదే
       పంతమే ఎపుడూ నా సొంతం
                                  || దూకే వాగు నా నేస్తం ||
.
       ఊహకు నీవే ఊపిరి పోసి
       చూపవే నా ఈ ఓ చిరుగాలి
       కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి
       తుంటరి తూనీగనై తిరగాలి
       దోశెడు ఊసులు తీసుకువెళ్లి
       పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
                              |ఆమె| || మానస వీణ ||
                     |ఖోరస్| || దూకే వాగు నా నేస్తం ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

Enjoy the simple pleasures combined with great ambitions!
అంతే కదా మరి, వట్టి ఆశలతో వ్రాస్తే అది సిరివెన్నెల పాటెందుకవుతుంది :)
.
పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జో కొడుతుంటే and అలలాగే నింగికే నిత్యం ఎదురీదే పంతమే ఎపుడూ నా సొంతం
.
కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలి!
.
“తారల పొదరింట రాతిరి మజిలీ” Simply indescribable thought!
.
Enjoy all the lines in this Sirivennela Classic!
[Also refer to Page 71-72 in సిరివెన్నెల తరంగాలు]
…………………………………………………………………………………………………