Posted by admin on 14th August 2009 in Don't marry
Audio Song:
Video Song:
Movie Name
Manmadhudu Song Singers S.P. Balu Music Director Devisri Prasad Year Released 2002 Actors Nagarjuna, Sonali Bendre,
Anshu Director Vijaya Bhaskar Producer Nagarjuna Akkineni
Context
Song Context: Don’t marry, Be happy!
Song Lyrics
||సాకీ||
వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్లి గోతిలో పడద్దురా
వద్దురా…వద్దు…
.
||ప|| |అతడు|
వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్లి గోతిలో పడద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి
పడిపోవద్దు కాలుజారి
తాళికట్టద్దు ఖర్మకాలి
ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా
జన్మంతా విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుంది రా
ఆపుకోలేని ఈ తొందర
Don’t marry..Be happy ||4||
.
||చ|| |అతడు|
శివ అని నా క్లోజ్ ఫ్రెండు
లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీ లో వాడు గ్రీకు వీరుడు
మ్యారేజి కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు
ఎంత మారిపోయాడు…గుర్తుపట్టలేనట్టు
బక్కచిక్కిపోయి..మంచి లుక్కు పోయి
ఫేసు పాలిపోయి…జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్క పట్టి ఏడ్చాడు…ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏ పూటకాపూటే తనకి లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం…పెళ్లి క్షమించరాని నేరం
Don’t marry..Be happy ||4|| ||వద్దురా||
.
||చ|| |అతడు|
అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్ళితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు..పళ్లేక ఇంటి పోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడా ఉండదనుకుంట
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా
వెంటపడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట
కోడె నాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వేస్టనీ,ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా
Don’t marry..Be happy ||4|| ||వద్దురా||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
The dude is advocating “not to marry to be happy”, with narrative examples
…………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world