| 
 | 
 Context 
Song Context: 
మనవైన ఈ క్షణాలే అక్షరాలై - మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ!  | 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       గగనానికి ఉదయం ఒకటే 
       కెరటాలకి సంద్రం ఒకటే 
       జగమంతట ప్రణయం ఒకటే ఒకటే… 
       ప్రణయానికి నిలయం మనమై 
       యుగయుగముల పయనం మనమై 
       ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే 
       జన్మించలేదా నీవు నా కోసమే 
       గుర్తించలేదా నన్ను నా ప్రాణమే 
       ప్రేమ….ప్రేమ…ప్రేమ…ప్రేమ… 
                        || గగనానికి || 
. 
||చ|| |అతడు| 
       నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ 
       నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ 
       నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై 
       కదిలించలేదా నేనే మేలుకొలుపై 
       గతజన్మ జ్ఞాపాకాన్నై నిన్ను పిలువ 
       కరగాల మంచుపొరలో ??? 
                         ||గగనానికి || 
. 
||చ|| |అతడు| 
       నా ఊహల్లో కదిలే కళలే ఎదుటపడినవి 
       నా ఊపిర్లో ఎగసే సెగలే కుదుటపడినవి 
       సమయాన్ని శాస్వతంగా నిలిచిపోనీ 
       మమతన్న అమృతంలో మునిగిపోనీ 
       మనవైన ఈ క్షణాలే అక్షరాలై 
       మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ 
                          ||గగనానికి || 
. 
. 
              (Contributed by Nagarjuna)  | 
| 
 Highlights 
……………………………………………………………………………………………….. 
 | 
					
				 
				  3 Comments »