|
Song (దగ్గరున్నప్పుడు) Lyrics
Context: When the lovers are together!
(మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా!)
.
||ప|| |అతడు|
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా
|ఆమె|
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా
|అతడు|
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
.
||చ|| |అతడు|
వయసుకే తెలియదే ఎన్నాళ్లో గడిచిందనీ
పరికిణీ బొమ్మకి పైట చుడుతుందనీ
|ఆమె|
దూరమే చెప్పదే నీ రూపు మారిందనీ
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
|అతడు|
ఇక పై మన కౌగిలింతకి
చలి చీకటి కంటపడదని
|ఆమె|
ఎపుడూ మన జంట గడపకి
కలతన్నది చేరుకోదనీ….
|అతడు|
కొత్తగా తెలుసుకున్నాననీ…..
||చెప్పనా ప్రేమ ||
.
||చ|| |అతడు|
రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరివచ్చానుగా
|ఆమె|
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడకా
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
|అతడు|
ప్రాణానికి రూపముందనీ అది నువ్వై ఎదురయిందని
|ఆమె|
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నదే నడుపుతుందనీ
|అతడు|
విరహమే తెలుసుకోవాలనీ….
|| చెప్పనా ప్రేమ ||
.
.
(Contributed by Nagarjuna) |
Song (విరహంతో) Lyrics
Context: When the lovers are missing each other!
(ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా, చెప్పవే చెలిమి చిరునామా!)
.
||ప|| |అతడు|
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే ||
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
.
||చ|| |అతడు|
ఇప్పుడే నువ్విలా వెళ్లావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ||2||
ఎపుడో ఒకనాటి నిన్ననీ
వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడూ నిను చూపగలననీ
ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదెలా
|ఆమె|
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే ||
.
||చ|| |ఆమె|
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని || ఆశగా ||
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగిన
నిను చేరే వరకు ఎక్కడా కైరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా
|అతడు| || చెప్పవే ||
|ఆమె| || చెప్పవే ||
|అతడు| మనసంతా నువ్వే || 3 || మనసంతా నువ్వే
.
.
(Contributed by Nagarjuna) |
Highlights (1 & 2)
Yet another double header masterpiece - the same పల్లవి in two different contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
The first one is when the lovers are together & the second is when they are missing each other!
.
Never ending stream of concepts on ప్రేమ:
A total of about 15 concepts in the two songs!
.
A few to quote:
1) ఇప్పుడే నువ్విలా వెళ్లావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
2) నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగిన
నిను చేరే వరకు ఎక్కడా కైరిగించను కంటి నీరుగా
3) నేస్తమా నీకు తెలిసేదెలా
4) స్నేహమా నీకు తెలిపేదెలా
5) ఎపుడో ఒకనాటి నిన్ననీ
వెతికానని ఎవరు నవ్వనీ
6) దూరమే చెప్పదే నీ రూపు మారిందనీ
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
7) రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరివచ్చానుగా
8.) ప్రాణానికి రూపముందనీ అది నువ్వై ఎదురయిందని
9) ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నదే నడుపుతుందనీ
విరహమే తెలుసుకోవాలనీ….
……………………………………………………………………………………………..
Huh, Can this poet write a song without a concept? |
|
No Comments »