Posted by admin on 18th September 2009 in కోపమా నా పైన
Audio Song:
Video Song:
Movie Name Varsham Song Singers
Karthik, Shreya Goshal Music Director DeviSri Prasad Year Released 2004 Actors Prabhas, Trisha Director Shobhan Producer M.S. Raju
Context
Song Context: కోపమా నా పైన!
Song Lyrics
||ప|| |ఆమె|
కోపమా నా పైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..హో…
|అతడు|
చాలులే నీ నటన సాగదే ఇటు పైనా
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనే లలనా
|ఆమె|
దరిచేరిన నెచ్చెలి పైనా దయ చూపవ కాస్తైనా
|అతడు|
మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ ఓ ఓ…
.
||చ|| |ఆమె|
హో కస్సుమని కారంగా కసిరినది చాలింకా
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా
|అతడు|
కుదురుగా కడదాకా కలిసి అడూగేయవుగా
కనుల వెనకే కరిగిపోయే కలవి గనుకా
|ఆమె|
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
|అతడు|
నువు గొడుగుని ఎగరేస్తావే జడివానా హో…
ఓ ఓ ఓ ఓ…
||కోపమా నా పైనా||
.
||చ|| |ఆమె|
తిరిగి నిను నా దాకా చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనక
|అతడు|
సులువుగా నీ లాగా మరిచిపోలేదింకా
మనసు విలువ నాకు బాగా తెలుసు గనక
|ఆమె|
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
|అతడు|
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా
హో ఓ ఓ …..
||కోపమా నా పైనా||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world