Movie Name Varsham Song Singers
S.P. Charan, Sumanagali Music Director DeviSri Prasad Year Released 2004 Actors Prabhas, Trisha Director Shobhan Producer M.S. Raju
Context
Song Context: ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతం!
Song Lyrics
||ప|| |అతడు|
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
|ఆమె|
చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం
|అతడు|
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
|ఆమె|
చినుకు పూలహారాలే అల్లుతున్నది మన కోసం
|అతడు|
తడిపి తడిపీ తనతో నడిపీ హరివిల్లులు వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతం…
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం..
|| మెల్లగా ||
.
||చ|| |అతడు|
నీ మెలికలలోనా ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా..
|ఆమె|
ఆ ఉరుములలోనా నీ పిలుపును వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా..
|అతడు|
మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
|ఆమె|
జతపడే స్నేహమై అనునయించనా
|అతడు|
చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నినువిడగా
|అతడు|
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతం…
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం..
|| మెల్లగా ||
.
||చ|| |ఆమె|
ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
|అతడు|
ఏ చిరుచినుకైనా నీ సిరులను చూపేనా…
ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా..
|ఆమె|
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా…
|అతడు|
విడుదలే వద్దనే ముడులు వేయనా
|ఆమె|
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివెనయ
|అతడు|
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతం…
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం..
|| మెల్లగా ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివెనయ .
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
…………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world