Movie Name Aadavari Matalaki
Ardhale Verule Song Singers
S.P. Balu Music Director YuvanSankar Raja Year Released 2007 Actors Venkatesh, Trisha Director Sri Raghava Producer N.V. Prasad,
Sanam Naga Ashok Kumar
Context
Song Context: అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా!
Song Lyrics
||ప|| |అతడు|
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్లుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా కోవేల్లో దేవేరిగా
గుండెల్లో కొలువుండగా
||అల్లంత||
.
||చ|| |అతడు|
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్న పొందే వీలుందా అందరికి అందనిది ఈ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందమనిపించగా
దిగివచ్చెనో ఏమో దివి కానుక
||అరుదైన చిన్నారిగా||
.
||చ|| |అతడు|
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో యెందరిని నిలబడనీక
ఎన్నో వంపుల్తో పొంగే ఈ నది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలి పరిచయమొక తీయని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
||అల్లంత||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
…………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world