Archive for the ‘నీకు చెప్పాలని!’ Category

చక్రం: ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా

Posted by admin on 9th October 2009 in నీకు చెప్పాలని!

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Chakram
Song Singers
   Chakri
Music Director
   Chakri
Year Released
   2005
Actors
   Prabhas, Asin, Charmee
Director
   Krishna Vamsi
Producer
   C. VenkatRamaraju,
   G. SivaRaju

Context

Song Context:
           నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ…  నీకు చెప్పాలని!

Song Lyrics

||ప|| |అతడు|
       ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
       ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
       నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ
       నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ
       నీకు చెప్పాలని
                           ||ఒకే ఒక మాట ||
.
||చ|| |అతడు|
       నేను అనీ లేను అనీ చెబితే ఏం చేస్తావో
       నమ్మననీ నవ్వుకుని చాల్లే పొమ్మంటావో
       నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
       నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
       నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
       తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ
       నీకు చెప్పాలని
                            ||ఒకే ఒక మాట ||
.
||చ|| |అతడు|
       నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
       నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
       నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
       నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ
       ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
       ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
       నీకు చెప్పాలని
                            ||ఒకే ఒక మాట ||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

   నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
   నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ
   ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
   ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
   నీకు చెప్పాలని
…………………………………………………………………………………………………