|
Context
Song Context:
ఆపదేం రాదే నీ దాక నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా దీపమై చూస్తూ ఉంటాగా! |
Song Lyrics
||ప|| |అతడు|
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకోలేనంతగా
ఆపదేం రాదే నీ దాక నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా
కానీ అనుకోనీ అలివేణి
ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్లిపోనీ ఆరాటాన్ని
||కానీ అనుకోనీ||
||లాలిజో లాలిజో ||
.
||చ|| |అతడు|
ఊరికే ఉసూరు అంటావే
ఊహకే ఉలిక్కిపడతావే
|ఆమె|
చక్కగా సలహాలిస్తావే
తిక్కగా తికమకపెడతావే
|అతడు|
రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించే రంగుల లోకాన్నే
||కానీ అనుకోనీ|| ||2||
||లాలిజో లాలిజో ||
.
||చ|| |ఆమె|
ఎదురుగా పులి కనపడుతుంటే
కుదురుగా నిలబడమంటావే
|అతడు|
బెదురుగా బరువెక్కిందంటే
మది ఇలా భ్రమపడుతున్నట్టే
గుప్పెడు గుండెల్లొ నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవే
||కానీ అనుకోనీ|| ||2||
||లాలిజో లాలిజో||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another జోలపాట.
The context is to put her, who is in fear, to sleep!
Follow the lyrics to appreciate how apt they are to the context.
.
కానీ అనుకోనీ అలివేణి ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్లిపోనీ ఆరాటాన్ని
.
గుప్పెడు గుండెల్లొ నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవే
………………………………………………………………………………………………… |
|
No Comments »