|
Context
Song Context:
నువ్వే నువ్వే కావలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై
శ్వాసలేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
||ఏ చోట||
.
||చ|| |ఆమె|
నేల వైపు చూసే నేరం చేశావనీ నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్లే మారం మానుకోమనీ తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మ వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవో
క్షణమై కరిగే కలవా….
|| నువ్వే నువ్వే ||
|| రేపు లేని ||
.
||చ|| |ఆమె|
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నా కూడా చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికేవరకు నడిపే వెలుగై రావా
|| నువ్వే నువ్వే ||
||ఏ చోట ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
నేల వైపు చూసే నేరం చేశావనీ నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్లే మారం మానుకోమనీ తల్లి తీగ బంధిస్తుందా మల్లెపూవుని
.
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా, నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా, కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
………………………………………………………………………………………………. |
|
No Comments »