Archive for the ‘ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కథలో’ Category

నువ్వే నువ్వే: అమ్మాయి నచ్చేసింది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvve Nuvve
Song Singers
   Rajesh,
   Kousalya
Music Director
   Koti
Year Released
   2002
Actors
   Tarun,
   Shriya
Director
   Trivikram Srinivas
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
   మనువే కుదిరీ కునుకే చెదిరీ మురిపెం ముదిరీ నా మనసు నిలవనంది!

Song Lyrics

||ప|| |అతడు|
       అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
       ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ
|ఆమె|
       వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపా అంది
       ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది
|అతడు|
       ఓ ఓ ఓ…. ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కథలో
|ఆమె|
       మనువే కుదిరీ కునుకే చెదిరీ మురిపెం ముదిరీ
       నా మనసు నిలవనంది
                                       || అమ్మాయి ||
.
||చ|| |అతడు|
       ఈ గాలి రోజులా వీస్తున్నా
       ఈ వేళ వేరేలా వింటున్నా సన్నాయి రాగాలుగా
|ఆమె|
       నా వైపు రోజులా చూస్తున్నా
       ఈ దాడి ఏదోలా అవుతున్నా నీ కన్ను ఏమన్నదో
       నా ఈడు ఏం విన్నదో
|అతడు|
       ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
|ఆమె|
       నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
|అతడు|
       ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి అవుతున్నా
|ఆమె|
       కొమ్మల్లో చిలక మోమాటపడక వచ్చి వాలమ్మా
                                       || అమ్మాయి ||
.
||చ|| |ఆమె|
       ముత్యాల మేనాలే రప్పించి
       మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా
|అతడు|
       అందాల హద్దుల్నే తప్పించి
       వందేళ్ల కౌగిళ్లే అందించీ
       ఊరించు ఆ వేడుకా
       ఓ ఓ ఓ…ఊహించనీ నన్నిలా
|ఆమె|
       ఏంటి ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వూ
|అతడు|  
       ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచోస్తేందే నువ్వూ
|ఆమె|
       కవ్వించి కరిగించీ కరిగే వయసుని కాపాడు
                                     || అమ్మాయి ||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….