|
Context
Song Context:
లవ్వు చేయండిరా - మొద్దు మనిషిని ముద్దుగా దిద్దుతుందిరా! |
Song Lyrics
||ప|| |అతడు|
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా ||2||
మట్టి ముద్ద ముత్యమల్లే ఎలా మారేరా
అరె రాగిముక్క రత్నమల్లే ఎలా మెరిసేరా
గడ్డిపువ్వు పారిజాతం ఎలా అయ్యెరా
అరె పోకిరోడు ప్రయోజకుడు ఎలా మరేరా
ప్రేమ వల్లరా ప్రేయసి మాటవల్లరా
బలం వుందిరా ప్రేమకు ఫలితముందిరా
లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా
బయలుదేరండిరా మీరు బాయ్ఫ్రేండ్స్ కండిరా
.
||చ|| |అతడు|
గుండె కాయలోన ఒకరి బొమ్మ ఉంచరా
అది కొండమీది కోతినైన దించుతుందిరా
అండ ఒకరు దొరుకునన్న ఊహ చాలురా
అప్పుడు ఎండ మావిలో నుంచి నీళ్ళు తీయవచ్చురా
గుడ్డికాదురా ప్రేమ బ్లడ్ లైట్ రా
అడ్డురాదురా లైఫుకి ఒడ్డు చూపరా
||లవ్వు చెయండిరా ||
.
||చ|| |అతడు|
ప్రేమలోన చెప్పలేని ప్రేరణుందిరా
ఇంపాజిబుల్ పాజిబుల్ గా మార్చుతుందిరా
ప్రేమలోన అంతులేని శక్తి ఉందిరా
పోక్రాన్లో బాంబులాగా పేలుతుందిరా
వద్దు అనకురా ప్రేమకు సిధ్ధమవ్వరా
మొద్దు మనిషిని ముద్దుగా దిద్దుతుందిరా
||లవ్వు చెయండిరా ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
No Comments »