|
Context
Song Context:
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏది రామరి ఏమూలున్నా |
Song Lyrics
||ప|| |ఆమె|
ఓ మైనా నీ గానం నే విన్నా
ఎటువున్నా ఏటవాలు పాట వెంట రానా
కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావె
మరి రావే ఇకనైనా
కొమ్మల నడిగానె ప్రతిరెమ్మని వెతికానె
కనిపించవు కాస్తయినా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏది రామరి ఏమూలున్నా
||కమ్మని గీతాలే ||
.
||చ|| |ఆమె|
ఎవరైనా చూశారా ఎపుడైనా
ఉదయాన కురిసే వన్నెల వానా
కరిమబ్బు లాటి నడిరేయి కరిగి
కురిసింది కిరణాలుగా
ఒక్కొక్కతార చినుకల్లే జారి
వెలిసింది తొలికాంతిగా ||కరిమబ్బు||
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే
||కమ్మని గీతాలే ||
.
||చ|| |ఆమె|
నన్నేనా కోరుకుంది ఈ వరాల కోనా
ఏలుకోనా కళ్ళముందు విందులీక్షణాన
సీతాకోకచిలుకా తీసుకుపో నీవెనుక
వనమంత చూపించగా
ఆ మొక్క ఈ మొలకా అన్నీ తెలుసు కనుకా
వివరించు ఇంచక్కగా ||సీతాకోకచిలుకా||
కీకారణ్యంలో నీరెక్కే దిక్కైరానా
||కమ్మని గీతాలే ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
Fascinating Lyrics!
.
[Also refer to Page 78 of సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………. |
|
No Comments »