|
Context
Song Context:
కలో కాదో నాకే నిజం తేలక, ఎలా చెప్పడం తాను నాకెవ్వరో! |
Song Lyrics
||ప|| |అతడు|
నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితే చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ల ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగిరానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా
||ఓ నవ్వు చాలు||
.
||చ|| |అతడు|
గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెలా
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం
||ఓ నవ్వు చాలు||
.
||చ|| |అతడు|
గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతిక్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
.
||ఖోరస్||
అదిరిపడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బ మన్మథుడి దెబ్బ
||ఓ నవ్వు చాలు||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా,
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా!
.
అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం, శిలైపోని మనిషుంటే మనిషే అనం!
.
కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో!
……………………………………………………………………………………………….
|
|
No Comments »