|
Context
Song Context:
ఏదో చేస్తా వీలు చూసుకుని నీతో వస్తా కళ్లు మూసుకుని |
Song Lyrics
||ప|| |అతడు|
వల్లా వల్లా ఏ చినుకిల్లా పిలిచిందే పిల్లా
ఖుల్లంఖుల్లా కులుకుల కిల్లా మెరిసిందే ఇల్లా
|ఆమె|
వల్లా వల్లా నా వయసిల్లా మెరిసే నీ వల్ల
ఇల్లా ఇల్లా ఇహ నా వల్ల తెలిసే అడగాలా
|అతడు|
సంథింగ్ సే నో వే..నాతో రాలేవే
|ఆమె|
షో మీ ఏదో వే..నాదీ నీ తోవే
|అతడు|
బాపురే జనమేం కావాలి యారో యారో
క్యా కరే మనకేం లే గోలీ మారో మారో
|ఆమె|
ఏదో చేస్తా వీలు చూసుకుని నీతో వస్తా కళ్లు మూసుకుని
||వల్లా వల్లా||
.
||చ|| |ఆమె|
పంతం వల్లో బడాయి వల్లో నచ్చావే నువ్వు మహా
మీసం రోషం వారెవా నాతో సరసం కోరవా
|అతడు|
మారం వల్లో మరెందు వల్లో రెచ్చిందా తహతహ
పాపం తాపం తాళవా మైకంలో పడి తేలవా
|ఆమె|
మిల మిల మెరిసిందే జింక దేఖో దేఖో
|అతడు|
నలుగురు వేటాడే లోగా దాక్కో దాక్కో
|ఆమె|
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా కాబట్టే కంగారయింది ఎద
|ఆమె|
||వల్లా వల్లా||
.
||చ|| |అతడు|
ఒంపుల విల్లా వయ్యారమిల్లా విహరిస్తే విల విల
అంతా చూసే వింతలా హల్ చల్ హల్ చల్ చిందులా
|ఆమె|
ఇంటర్ జిల్లా తుఫానయేలా దూసుకు రా జర జర
అందం చందం ఉందిరా అందిస్తారా విందులా
|అతడు|
వరదలా ముంచాయే నీలో లయలో హొయలో
|ఆమె|
దరిమిలా మనమేం చెయ్యాలో బోలో బోలో
|అతడు|
ముందేముంది చూడనీవు కదా
|ఆమె|
సందేహిస్తే సాగుతుందా కథ
|అతడు| వల్ల వల్ల వల్ల
|ఆమె| వల్ల వల్ల వల్ల
||వల్లా వల్లా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………
|
|
No Comments »