|
Context
Song Context:
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ!
పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ! |
Song Lyrics
||ప|| |అతడు|
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
||చక్రవర్తికీ ||
.
||చ|| |అతడు|
ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
|| చక్రవర్తికీ ||
.
||చ|| |అతడు|
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామా లో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనదీ
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
|| చక్రవర్తికీ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Super Conceptualization!
Tickling Lyrics!
.
[Also refer to Pages 197-198 of సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
4 Comments »