|
Context
Song Context:
పడిలేస్తూ మన వెనకాలే తడబడిపోతుంటే కాలం,
ఆనందో బ్రహ్మ అంది మన వేగం! |
Song Lyrics
||ప|| |అతడు|
భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మన వెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందో బ్రహ్మ అంది మన వేగం
||భూగోళంతో||
.
||చ|| |అతడు|
కలల లోగిళ్ల అద్భుతం
నిదురయే దాకా వెతుకుదాం
పదమంది నవ యవ్వనంలో పసితనం
దొరుకుతుందా అని అడగదే మన నమ్మకం
|ఆమె|
కలనైనా తరిమే గుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీ క్షణం
||భూగోళంతో ||
.
||చ|| |అతడు|
అదుపులో లేని పరుగులం
రస తరంగాన వెతుకుదాం
మనకింకా తెలియదు కదా భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
|ఆమె|
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలని మన వైపిలా
|| భూగోళంతో ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Inspirational, Youthful…..
……………………………………………………………………………………………… |
|
No Comments »