Archive for the ‘పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను’ Category

రుద్రవీణ: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   RudraVeena
Song Singers
   S.P. Balu
Music Director
   Ilaya Raja
Year Released
   1988
Actors
   Chiranjeevi,
   Shobhana
Director
   K. Balachander
Producer
   K. Nagendra Babu

Context

Song Context:
     పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను!
     [Like Nature, Art & Science are for all!
      I too will work towards that goal! I too will!]

Song Lyrics

|అతడు2|
       ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
       మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
       కష్టం వస్తేనే కద గుండె బలం తెలిసేది
       దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
       మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా
       ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
       ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
       అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ
.
||ప|| |అతడు|
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
       గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
.
||చ|| |అతడు|
       కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అనీ
       ఐనవాళ్లు వెలివేస్తే ఐనా నే ఏకాకిని ||కోకిలల ||
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
       పాట బాట మారాలని చెప్పడమే నా నేరం
       గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం
       వసంతాల అందం విరబూసే ఆనందం
       తేటితేనె పాట పంచవన్నెల విరితోట || వసంతాల ||
       బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
       మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ల బాటా || 2 ||
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
.
||చ|| |అతడు|
       ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం
       ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
       నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
       కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
       మంచువంచనకు మోడై గోడుపెట్టువాడొకడు
       వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
       అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
       అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్తకోకిల
       కళ్లు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోని కప్పలా
       బతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ
       కరువాయెను నా స్థానం
       చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది || 2 ||
.
||చ|| |అతడు|
       అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం
       నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
       ఎడారి బతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
       దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యధార్థ జీవన స్వరాలు
       నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
       ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
       జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
       కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
.
       నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతాను
       నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక వ్రిచ్చిమ్రోస్తాను
       నేను సైతం ప్రపంచాబ్జ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
       నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను || 2 ||
       సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియుంచుదాకా
       ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
       పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను || 2 ||
       నేను సైతం నేను సైతం నేను సైతం || 2 ||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
   Superb Conceptualization!
.
   దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
   మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా

.
   బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
   మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ల బాటా
.
   అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
.
   ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
   జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే గట్టనుకుంటూ
   కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
.
   నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతాను
   నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక వ్రిచ్చిమ్రోస్తాను
   నేను సైతం ప్రపంచాబ్జ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
   నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
   సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియుంచుదాకా
   ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
   పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
.
   [Also refer to pages 39-42 in సిరివెన్నెల తరంగాలు & pages 31-34 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….