|
Context
Song Context:
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
[No matter how much you progress never foget your roots!
Our progress will be uitmately festival to ALL!] |
Song Lyrics
|సాకీ|
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యెచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ
మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటేనకా
.
||ప|| |అతడు|
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని || నమ్మకు ||
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి || 2 ||
కలలే వలగా విసిరే చీకట్లను || నమ్మకు ||
వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
|| నమ్మకు ||
.
||చ|| |అతడు|
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో || 2 ||
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికీ
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ || 2 ||
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
|| నమ్మకు ||
.
||చ|| |అతడు|
శీతాకాలంలో ఏ కోయిలైనా - రాగం తీసేనా ఏకాకిలా || 2 ||
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవ్వరికీ చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా || 2 ||
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
|| నమ్మకు ||
. .
(Contributed by Nagarjuna) |
Highlights
The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
Superb Conceptualization!
.
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
.
వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
.
పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అని
.
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు ఆ గీతాలు పలుకును కద
.
[Also refer to pages 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 37-39 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….
|
|
No Comments »