Archive for the ‘నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది’ Category

రుద్రవీణ: చుట్టుపక్కల చూడరా చిన్నవాడా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   RudraVeena
Song Singers
   S.P. Balu
Music Director
   Ilaya Raja
Year Released
   1988
Actors
   Chiranjeevi,
   Shobhana
Director
   K. Balachander
Producer
   K. Nagendra Babu

Context

Song Context:
     నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
     గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది

     [You are beneficiary from the society.
      So learn to give back as well!]

Song Lyrics

||ప|| |అతడు|
       చుట్టుపక్కల చూడరా చిన్నవాడా
       చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా || చుట్టుపక్కల ||
       కళ్లముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం
       సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం || 2 ||
                                                || చుట్టుపక్కల ||
.
||చ|| |అతడు|
       స్వర్గాలను అందుకోవాలని వడిగా గుడిమెట్లెక్కేవు
       సాటి మనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు
       కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
       గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే || కరుణను ||
                                             || చుట్టుపక్కల ||
.
||చ|| |అతడు|
       నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
       గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
       ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నవా
       తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే || రుణం ||
                                             || చుట్టుపక్కల||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
   Superb Conceptualization!
.
   కళ్లముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం
   సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం

.
   కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
   గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే
.
   నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
   గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
.
   ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నవా
   తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే
.
   [Also refer to Page 188 & 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 29-30 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………..