|
Context
Song Context:
Free bird - సీతాకోకచిలుక!
[Have a free ride on it's back!] |
Song Lyrics
కోరస్:
పొద్దున్నే ఎలిపోతే గోధూళి దాకా
పొద్దెట్టాగడిపేదే బంగారిమావా
ముప్పొద్దులా నీతో ముచ్చట్లే అయితే
బువ్వెట్టాగొస్తాదే సింగారి భామా
.
పల్లవి:
రంగురంగురెక్కల సీతాకోకచిలుకా - సీతాకోకచిలుకా
తోటంతా తిరుగుతావమ్మా నీవు తీరికే లేక
ఈ కన్నె విరిదాకా ఏ గుండె మూగ కేక
చేరుస్తున్నావో అది నీకైనా ఎరికా
||రంగు||
.
చరణం:
ఉరికి ఉరికి ఊహలూరేగి పిల్లగాలి ఊయలూగి
ఉండిఉండి గుండెలుప్పొంగి కొండవాగులాగ పొంగి
సరసానికనువైన వరసేదో వెదికి
ఎవరి దరికి చేరాలని ఎవరు రాసినారో
నీ రెక్కలపై ఆ రెక్కలపై
నీ రెక్కలపై ఆ చుక్కల ప్రేమలేఖ
||రంగు||
.
చరణం:
మూసుకున్న మనసు ముంగిలిలో రంగవల్లులెన్నో వేసి
వెలుగురాని వయసు వాకిలిలో వెండి పూలమొక్కలేసి
కనువిందు కలిగించు కిరణాల లిపిలో
జన్మముడులు చదవమన్న బ్రహ్మరాత ఏమో
నీ రెక్కలపై ఆ రెక్కలపై
నీ రెక్కలపై ఆ చుక్కల ప్రేమలేఖ
||రంగు||
.
.
(Contributed by Prabha) |
Highlights
పొద్దున్నే ఎలిపోతే గోధూళి దాకా, పొద్దెట్టాగడిచేదే బంగారిమావా
ముప్పొద్దులా నీతో ముచ్చట్లే అయితే, బువ్వెట్టాగొస్తాదే సింగారి భామా
అది మనిషి అయితే - సీతాకోకచిలుక is a free bird 
.
[Also refer to Page 102 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..
|
|
No Comments »