|
Context
Song Context:
A guy hailing from Amalapuram is lost in the United states!
[కల్లాకపటం లేని పల్లెల్లో పిల్లాణ్ణి
ఈ చుక్కల దిక్కులు దాటే దిక్కేదో చూపెట్టూ!] |
Song Lyrics
||ప|| |అతడు|
తిల్లానా తిల్లానా
తిల్లానా ధింతనన మోగిందిరో ఒళ్లంతా తిమ్మిరెక్కించేలా
తందాన తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా
ఇది భూలోకమో ఇంకో మాలోకమో ఇది భాగోతమో వింత సంగీతమో
||తిల్లానా ||
.
||చ|| |అతడు|
కల్లాకపటం లేని పల్లెల్లో పిల్లాణ్ణి
ఆటాపాటే కాని వేటంటే తెలియనివాణ్ణి
చీకూ చింతా లేని చాలా మామూలోణ్ణి
సత్తా ఉన్నా కానీ ఆ సంగతి గుర్తేలేని
హనుమంతుళ్లాంటోణ్ణి నేనందరికీ అయినోణ్ణి
తోకంటించారంటే లంకంతా కాలుస్తా
తిక్కే రేగిందంటే తాటంతా ఒలిచేస్తా
ఎదురొచ్చే సంద్రాలన్నీ ఎగిరొచ్హేనే ఇట్టా
|| తిల్లానా ||
.
||చ|| |అతడు|
ఊగే వయ్యారాల ఉయ్యాలా జంపాల
ఏమయ్యిందో నేల జాడే లేదియ్యాల
మా బాగుందే బాలా మత్తెక్కించే గోల
రబ్బరు బంతుల్లారా చిందాడే ఇంతుల్లారా
రంభల గుంపుల్లారా ఇంద్రుడ్లా రమ్మంటారా
ఉన్నా లేనట్టుందే నీ చుట్టూ ఏ గుట్టూ
నన్నూరిస్తూ ఉందే నన్నేదో చేసేట్టూ
ఈ చుక్కల దిక్కులు దాటే దిక్కేదో చూపెట్టూ
||తిల్లానా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »