|
Context
Song Context:
నమ్మర నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే! |
Song Lyrics
||సాకీ|| |ఖోరస్|
నమ్మర నేస్తం ధర్మమేవ జయతే
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే
.
||ప|| |అతడు|
తొలి వేకువ ఇంకా రాదేమంటూ నడి రాతిరిలో చీకటి చూస్తూ
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా
ఆ దైవం తానే అవతారంగా దిగివచ్చే తగు తరుణం దాకా
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా
పోగాలం రానీరా ఈ లోగా కంగారా
||నమ్మర నేస్తం||
.
||చ|| |అతడు|
నీలో ఉత్సాహం ఎక్కువైతే ఉన్మాదం దూకే ఆవేశం చేరనీదే ఏ గమ్యం
ఆయుధాన్ని దండిస్తే ఆగడాలు ఆగేనా
కాగడాగా వెలిగిస్తే మార్గం చూపించాలంతే
కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చెయ్యంతే
కార్చిచ్చే రగిలిస్తావా చేను మేసే కంచవుతావా
||నమ్మర నేస్తం||
.
||చ|| |అతడు|
బాణం వస్తుంటే దానిపైనా నీ కోపం
దాన్నిటు పంపించే శతృవేగా నీ లక్ష్యం
వీరధర్మం పాటిస్తే పోరు కూడా పూజేగా
కర్తవ్యంగా భావిస్తూ రక్షణ భారం మోస్తావో
కక్ష సాధిస్తానంటూ హత్యానేరం చేస్తావో
గమ్యం మాత్రం ఉంటే చాలదు
తప్పుడు తోవలో వెళ్లకు ఎపుడూ
||నమ్మర నేస్తం||
|అతడు| ||తొలి వేకువ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »