Archive for the ‘ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం’ Category

నీ స్నేహం: ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

Audio Song:
 
Movie Name
   Nee Sneham

Song Singers
   Rajesh, Usha
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Uday Kiran, Aarti Agarwal,
   Jatin
Director
   Paruchuri Murali
Producer
   M.S. Raju

Context

   ఈ అనుభవం వెన్నెల వర్షం, ఎలా తెలపటం ఈ సంతోషం!

Song Lyrics

||ప|| |అతడు|
       ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
       ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
       ఈ అనుభవం వెన్నెల వర్షం
       ఎలా తెలపటం ఈ సంతోషం
.
||చ|| |అతడు|
       నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
       అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ
|ఆమె|
       ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
       రెప్పలే దాటి రావే కలలో ఆశా
|అతడు|
       పొద్దే రాని నిద్దర్లోనే ఉండిపోనీ
       నిన్నే చూసే కల కోసం
|ఆమె|
       సర్లే కానీ చీకట్లోనే చేరుకోనీ
       నువ్వు కోరే అవకాశం
|అతడు|
       తక్కువే కాదులే ఈ జన్మలో ఈ వరం
                          ||ఇలా చూడు||
.
||చ|| |అతడు|
       వానలా తాకగానే ఉరిమే మేఘం
       వీణలా మోగుతుంది ఎదలో రాగం
|ఆమె|
       స్వాగతం పాడగానే మదిలో మైకం
       వచ్చి ఒడి చేరుతుందా ఊహా లోకం
|అతడు|
      ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
                       దక్కినంత ఆనందం..
|ఆమె|
       అయ్యో పాపం ఎక్కడ లేని ప్రేమ రోగం
                       తగ్గదేమో ఏ మాత్రం
|అతడు|
       తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం
                             ||ఇలా చూడు||
.
.
         (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………….