Archive for the ‘నీ నీడలో అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా’ Category

సంతోషం: నువ్వంటే నాకిష్టమని నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Santosham

Song Singers
   Rajesh, Usha
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Nagarjuna, Shriya,
   Gracy Singh
Director
   Dasarath
Producer
   Dr. K.L. Narayana

Context

Song Context: 
                     నీ నీడలో అణువణువు ఆడగా,
                        అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా!

Song Lyrics

||ప|| |అతడు|
       నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
|ఆమె|
       నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
|అతడు|
       నీ నవ్వులో శృతి కలిపి పాడగా
|ఆమె|
       నీ నీడలో అణువణువు ఆడగా
|ఇద్దరు|
       అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
                              || నువ్వంటే ||
.
||చ|| |అతడు|
       నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
       ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే కనిపించదా
|ఆమె|
       నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
       కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
|అతడు|
       వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
|ఆమె|
       సుదూరాల తారక సమీపాన వాలగా
|అతడు|
       లేనే లేదు ఇంకే కోరిక….
                               || నువ్వంటే ||
.
||చ|| |ఆమె|
       ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్ల కాలం
       నిన్నగా సనసన్నగా చేజారిపోనీయక
|అతడు|
       చూడు నా ఇంద్రజాలం వెనుదిరిగి వస్తుంది కాలం
       రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
|ఆమె|
       నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
|అతడు|
       ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
|ఆమె|
       ఇలా ఉండిపోతే చాలుగా…
                                  || నువ్వంటే ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….