|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప|| |ఆమె|
కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా
|అతడు|
కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా
|ఆమె|
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
|అతడు|
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
|| కలయా నిజమా ||
.
||చ|| |ఆమె|
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నది
|అతడు|
ఆహ ఊరుకోని ఏ వెర్రికోరికో తీర్చవా అంటున్నదీ
|ఆమె|
కోక ముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
|అతడు|
కుర్ర కళ్లు చీర గళ్లలో దారే లేక తిరుగుతున్నవి
|ఆమె|
ముంచే మైకమో మురిపించే మోహమో
|| కలయా నిజమా ||
.
||చ|| |అతడు|
చేయి వేయనా సేవ చేయనా ఓయనే వయ్యారమా
|ఆమె|
పాలముంచినా నీట ముంచినా నీ దయే శృంగారమా
|అతడు|
ఊహూ ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది
|ఆమె|
కాలు నేల నిలవకుంటది ఆకాశాన తేలుతున్నది
|అతడు|
అంతా మాయగా అనిపించే కాలమో
|| కలయా నిజమా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »