|
Context
Song Context:
హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా |
Song Lyrics
||ప|| |ఆమె|
హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా
తియ్యగా కొమ్మ ఒళ్ళో పున్నాగ పువ్వల్లె నవ్వమ్మా||హాయిగా||
హరివిల్లుగ నవ్వుతు ఉంటే ఎండల్లో వెన్నెల కాయదా
చిరు జల్లుగ నవ్వుతు ఉంటే కొండైనా వాగల్లె పొంగదా
నునుమెత్తగ నవ్వుతు ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా
తొలిపొద్దుగ నవ్వుతు ఉంటే రాయైనా రత్నంగా మారదా
||హాయిగా||
.
చరణం:
అగ్గిలా మండిపడే నీ పంతమంతా
తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా
అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే
బుద్ధిగా ఉంటాను అంటే నువ్వు నా బంగారు కొండ
ముద్దుగా నా మాట వింటే నువ్వు నా ముత్యాల దండ
రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా
ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక
||హరివిల్లుగ||
.
చరణం:
హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం
వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం
ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం
జన్మలో వీడనిది ఈ రాగబంధం
గూటిలో గువ్వలు సాక్షి గుడిలో దివ్వెలు సాక్షి
చెప్పుకున్న ఊసులే సాక్షి చేసుకున్న బాసలే సాక్షి
దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి
కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి
||హరివిల్లుగ||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »