| 
 | 
 Context 
Song Context: 
     కొండాకోనా గుండెల్లో వూగే ఉయ్యాల 
     వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల 
     మన్నెంలో అంతా మనకేసి చూసే వేళ 
     A sweet flow of thoughts!  | 
 
| 
 Song Lyrics 
||ప|| |కోరస్! 
       ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాల 
       సాగే సాగే జంపాల తాళం వేయాల 
                              ||ఊగే|| 
అతడు: 
       కొండాకోనా గుండెల్లో వూగే ఉయ్యాల 
కోరస్: 
       ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాల 
ఆమె: 
       వాగు వంక ఒంపుల్లో సాగే జంపాల 
కోరస్: 
       సాగే సాగే జంపాల తాళం వేయాల 
అతడు: 
       దొరికే చుక్కను ఏలే దొర నేనవ్వాల 
ఆమె: 
       కోరితే కోరిక చూసి చిలకై నవ్వాలా 
అతడు: 
       మన్నెంలో అంతా మనకేసి చూసే వేళ 
                     ||ఊగే|| ||సాగే || 
. 
చరణం: అతడు: 
       నిద్దుర చెడి మధనపడి మదిని లాలించాలి 
ఆమె: 
       ముచ్చటపడి ముద్దులతడి మొదటిముడవ్వాలి 
అతడు: 
       ప్రతి పొదలో మనకధలే కొత్తపూత పూయించాలి 
ఆమె: 
       మతిచెదిరే శృతిముదిరే తందనాలు తప్పించాలి 
అతడు: 
       అందెలుకట్టే అందాలన్ని సందిటపట్టాలి 
ఆమె: 
       తొందరపెట్టే ఆరాటాన్ని ముందుకునెట్టాలి 
అతడు: 
       ఏకాంతాన్ని అంతా మన జంటే పాలించాలి 
                        ||ఊగే|| ||సాగే || 
. 
చరణం: ఆమె: 
       సిగన నువ్వే మొగలిపువ్వై ఒదిగివుందువుగాని 
అతడు: 
       చిలిపి నవ్వే పిలుపునిస్తే రానా కిన్నెరసాని 
ఆమె: 
       కోడెనాగులా కొంటెసెగలే చుట్టుకోని కాటెయ్యాలి 
అతడు: 
       కొండవాగులా కన్నెవగలే కమ్ముకొని కవ్వించాలి 
ఆమె: 
       చిటిక విని సంతోషంతో తెచ్చా సొంపుల్ని 
అతడు: 
       కలలు కనే సావాసంతో గిచ్చా చెంపల్ని 
ఆమె: 
       కౌగిళ్ళోరాని ఎదపాడే రాగాలన్ని 
                           ||ఊగే|| ||సాగే || 
. 
. 
      (Contributed by Venkata Sreedhar)  | 
 
| 
 Highlights 
……………………………………………………………………………………………….. 
 | 
 
 
 | 
					
				 
				  No Comments »