|
Context
Song Context:
ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం! |
Song Lyrics
||ప|| |అతడు|
ఓం…ఓం……
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం || 2 ||
ఓంకార నాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకార నాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం
.
||చ|| |అతడు|
తన కళ్లముందే సామ్రాజ్య శిఖరాలు మన్ను పాలైనా
క్షణమైన తన గాథ గతములో విడిచి మృతి ఒడి చేరనిదీ ఖడ్గం
పూటకో పడమరను దాటి పూర్వాద్రిపై నిత్య ప్రభాతమై
వెలుగుతున్నదీ భరత ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం || 2 ||
మూడు వన్నెల కేతనముగా మింటికి ఎగసి
కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం
| ఖోరస్| ||ఖడ్గం|| || 4 ||
.
||చ|| |అతడు|
హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం
ధూర్త శిక్షణకై వహించిన కఱకుతనమీ ఖడ్గం
హుంకరించి అహంకరించి అధిక్రమించిన
ఆకతాయిల అంతు చూసిన క్షాత్ర సత్వం
అస్తమించని అర్క ఖడ్గం
శరణుకోరి శిరస్సు వంచి సమాశ్రయించిన
అన్ని జాతుల పొదువుకున్న ఉదార తత్వం
జగతి మరువని ధర్మ ఖడ్గం
నిద్దుర మత్తును వదిలించే కెంజాయల జిలుగీ ఖడ్గం
|ఖోరస్| ||ఖడ్గం|| || 4 ||
చిక్కటి చీకటి చీల్చుకు వచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
|ఖోరస్| ||ఖడ్గం|| || 4 ||
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
|ఖోరస్| ||ఖడ్గం|| || 4 ||
|ఖోరస్|
కెంజాయల జిలుగీ ఖడ్గం తెలతెల్లని వెలుగీ ఖడ్గం సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
సిరివెన్నెల గారూ, మా సినిమాకి title “ఖడ్గం” అని పెట్టేశాం. Title song మీరే ఎలా రాస్తారో అంతా మీ మీదే భారం!
The answer is - the enormous struggle to conceptualize the title “ఖడ్గం” song (culminating as - ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం), is what you are seeing on this page!
.
A simple english translation of the song below:
………………………………………………………………………………………………
This ఖడ్గం is the symbol for the mother earth (వేదధాత్రి) borne with ఓంకార నాదం!
This ఖడ్గం is the shape for the ఆదిశక్తి living in హ్రీంకార నాదం!
This ఖడ్గం reflects the ఘనత of the human race constantly travelling for eras!
This ఖడ్గం is the proof for the generations of human history!
.
Even with the destruction of the kingdoms, this ఖడ్గం lives on!
This భరత ఖడ్గం crosses the sunsets by rising on the eastern hills each and every morning!
This ఖడ్గం is not a mere weapon - but “a Great Wonder”!
This ఖడ్గం is the యశోరాశి - leading the path to the next generations by flying in the skies as “the three colour flag”!
.
This భక్తి ఖడ్గం is the fruits of హరి incarnations on this వేదధాత్రి!
This ఖడ్గం shows the path to ముక్తి with the proof of దైవాంశ in humans!
This ఖడ్గం is the protector of the needy - the symbol for human bravery!
This ఖడ్గం is the destructor of the demons - the symbol for కఱకుతనం!
This ఖడ్గం is the ever burning “Sun” - proof to the క్షాత్ర సత్వం!
This ఖడ్గం is the symbol of ఉదార తత్వం - by embracing all human races & religions!
The world will never forget this ధర్మ ఖడ్గం!
.
This ఖడ్గం is the rays of the sunset (కాషాయం రంగు) making us to be ever awake!
This ఖడ్గం is white glow (తెలుపు రంగు) piercing through the darkness!
This ఖడ్గం is the blosomming golden green of the plants (ఆకుపచ్చ రంగు) by coming out of the earth!
.
This ఖడ్గం is the యశోరాశి - leading the path to the next generations by flying in the skies as “the three colour flag”!
………………………………………………………………………………………………… |
|
1 Comment »