|
Context
Song Context:
కలగంటి తెలుగింటి కలకంఠిని
కొలువుంటె చాలంట నా కంట సుకుమారి
|
Song Lyrics
||ప|| |ఆమె|
సౌందర్యలహరి సౌందర్యలహరి
|అతడు|
సౌందర్యలహరి స్వప్నసుందరి - నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి - రావే రసమాధురీ…
వన్నెచిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓ సారి
సౌందర్యలహరి స్వప్నసుందరి - నువ్వే నా ఊపిరి
.
||చ|| |అతడు|
పాలచెక్కిళ్లు దీపాల పుట్టిళ్లు ||2||
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఫక్కున చిందిన నవ్వులలో లెక్కకు అందని రతనాలు
యతికైన మతిపోయే ప్రతి భంగిమా…
యదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి
||ఇద్దరు|| |సౌందర్యలహరి|
|అతడు|
స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
.
||చ|| |అతడు|
నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్లు ||2||
నను చూసి వలవేసి మెలి వెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు శ్వాసకు నేర్పెను సరిగమలు
కలగంటి తెలుగింటి కలకంఠిని
కొలువుంటె చాలంట నా కంట సుకుమారి
సౌందర్యలహరి స్వప్నసుందరి - నువ్వే నా ఊపిరి ||2||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A rare and purely descriptive (i.e., adjective-filled) song from Sirivennela - quite un-sirivennelisque.
Perhaps the situation of “dream girl” demands the explicit description, yet exceptionally decent!
The master can make those fine adjustments, as only the context commands!
.
[Also refer to Page 212 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
No Comments »