Archive for the ‘చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి - నీ ఏకాంతం ఓదార్పవుతాను’ Category

గులాబి: ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వై పోయా నేను

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gulabi
Song Singers
   Sasi Preetham
Music Director
   Sasi Preetham
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Maheswari
Director
   Krishna Vamsi
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
   కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా- నీ ఊపిరినై నే జీవిస్తున్నాను!
   నీ కష్టంలో నేనూ ఉన్నాను - కరిగే నీ కన్నీరవుతా నేను
   చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి - నీ ఏకాంతం ఓదార్పవుతాను

Song Lyrics

||ప|| |అతడు|
       ఏ రోజైతే చూశానో నిన్ను
       ఆ రోజే నువ్వైపోయా నేను
                          ||ఏ రోజైతే||
       కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
       నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
       నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
       నీ రూపే నా వేచే గుండెల్లో
       నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
       ఆ నీ నీడై వస్తాను ఎటు వైపున్నా
       నీ కష్టంలో నేనూ ఉన్నాను
       కరిగే నీ కన్నీరవుతా నేను
       చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి
       నీ ఏకాంతం ఓదార్పవుతాను
.
||చ|| |అతడు|
       కాలం ఏదో గాయం చేసింది
       నిన్నే మాయం చేశానంటోంది
       లోకం నమ్మి అయ్యో అంటోంది
       శోకం కమ్మి జో కొడతానంది
       గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
       ఆ జీవం నీవని సాక్షమునిస్తున్నా
       నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ
       నాలో మోగే గుండెల సవ్వడులే
       అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టా
       నువు లేకుంటే నేనంటూ ఉండనుగా
                      || నీ కష్టంలో ||
                      || ఏ రోజైతే ||
.
.
           (Contributed by Nagarjuna)

Highlights

[Also refer to Pages 152 in సిరివెన్నెల తరంగాలు]
…………………………………………………………………………………………………