|
Context
Song Context:
ఆశయపథమున నడిచిన రాణా ప్రతాప్, వీరశివాజీ, భగత్ సింగ్, నేతాజీ
మొదలగు నేతల ఉత్తేజముతో బ్రతకండి - వందేమాతరం !
|
Song Lyrics
||ప|| |అతడు|
వందేమాతరం వందేమాతరం
కోరస్:
వందేమాతరం వందేమాతరం
||వందేమాతరం||
.
||చ|| అతడు:
కారుచీకటిని చీల్చి వెలుతురును పంచే రవికిరణాలై
జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై
భావిజీవితపు ఆదర్శానికి గడచిన కాలము వెదకండి
ఆశయపథమున నడిచిన నేతల ఉత్తేజముతో బ్రతకండి
||వందేమాతరం||
.
||చ|| అతడు:
భారత దేశము బానిసత్వమున కృంగిన ఆ సమయానా
స్వాతంత్ర్య సంగ్రామ ప్రాంగణమ్ములో కొదమసింహమై రాణా
చూపిన వీరప్రతాపం నీ ఆదర్శాలకు రూపం
ఆ రాణాప్రతాప సింహం నీ జాతి జాగృతికి చిహ్నం
నీ జాతి జాగృతికి చిహ్నం
||వందేమాతరం||
.
||చ|| అతడు:
దేశ భాస్కరుని దాస్యగ్రహణం పట్టిన తరుణములోనా
కటికచీకటిని జాతిని కమ్మిన నైరాశ్యపు వేదనలోనా
ఆ గ్రహణము పట్టిన వేళ ఆగ్రహమున పుట్టిన జ్వాల
ప్రభవించేను వీరశివాజీ కాలాక్షుని తాండవలీల
కాలాక్షుని తాండవలీల
||వందేమాతరం||
.
||చ|| అతడు:
పరజాతీయుల పరిహాసమ్మున పౌరుషాగ్ని ప్రజ్వలించగా
జాతికేతనను బంధించిన ఆ శృంకలాలు తెగదెంచగా
కార్చిచ్చులాగా దావాగ్నిలాగా ఆ భగత్ సింగ్ చెలరేగినాడు
చిరునవ్వుతోడ నవయవ్వనాన్ని ఉరితాటి తోటి పెనవేసినాడు
ఉరితాటి తోటి పెనవేసినాడు
||వందేమాతరం||
.
||చ|| అతడు:
ఉరకలు వేసే యువకుల నెత్తుటి కత్తుల కవాతు నడిపిన నేత
అజాద్ హిందు ఫౌజ్ నిర్మాత నేతాజీ నీ స్ఫూర్తి దాత
నీది ఆ వారసత్వం నీకున్నది వారిసత్వం
నీ జీవిత సర్వస్వం జాతికి సగర్వమ్ముగా సమర్పితం
సగర్వమ్ముగా సమర్పితం
||వందేమాతరం||
.
||చ|| అతడు:
సుకుమారమైన కుసుమాలవంటి జలతారు జీవితాలు
కటువైన దేశసంరక్షణార్థమై రగిలించి చూపినారు
కాలగతిలోన భౌతికమ్ముగా చితిజ్వాలలలో కలిశారు
జాతి జ్యోతులై చిరంజీవులై ఇతిహాసముగా వెలిశారు
ఇతిహాసముగా వెలిశారు
||వందేమాతరం||
.
.
(Contributed by Dr. Jayasankar) |
Highlights
Follow the complete lyrics!
………………………………………………………………………………………………… |
|
7 Comments »