|
Context
Song Context:
ఇంట్లో ఉన్న దొంగ చేతికి తాళాలందించి సాధించేదెముంది ఊరి చివర గస్తీ!
జవానై కత్తి దూసినా కిసానై కలుపుతీసినా స్వదేశి రక్షణ ఒకటే లక్ష్యం భాయీ!
ప్రమాదం ముందులేదురా, తుపాకీ దిశను మార్చరా,
లోనిశత్రువును పోల్చిచీల్చి పారెయ్యరా!
పారా హుషార్ భాయీ! భద్రం సుమా సిపాయీ!
|
Song Lyrics
||ప|| |ఆమె|
పారా హుషార్ భాయీ! భద్రం సుమా సిపాయీ!
పాడురేయి జాడతీయి భగ్గుమను జ్వాలవై
పిడుగులయ్యే అడుగులెయ్యి మృత్యువుకే మృత్యువై
క్రీనీడల కీడును కనిపెట్టాలొయీ
||అతడు & కోరస్|| ||పారా హుషార్||
.
||చ|| |ఆమె|
ఇంట్లో ఉన్న దొంగ చేతికి తాళాలందించి సాధించేదెముంది ఊరి చివర గస్తీ
కంట్లో ఉన్న కారు చీకటిని కను పాపగ ఎంచి నువు చోసెదేముంది రాత్రిని గాలించి
కంచెలే చేలుని మేస్తుంటే తోడేళ్ళే మేకల్ని కాస్తుంటే
అతడు:
నేరాలే తీర్పులు చెబుతుంటె దెయ్యలె దీవెనలిస్తుంటె
ఆమె:
స్వదేశం కుళ్ళిపోయెరా అటే నీ కళ్ళు తిప్పరా
జవానై కత్తి దూసినా కిసానై కలుపుతీసినా
స్వదేశి రక్షణ ఒకటే లక్ష్యం భాయీ ఓ..ఓ..
అతడు & కోరస్:
పారా హుషార్ భాయీ - భద్రం సుమా సిపాయీ ||2||
.
||చ|| |ఆమె|
నిను కనిపెంచి మాతృభూమికి అందించిన తల్లి ఏ మూలో పేగుకదిలి తల్లడిల్లెనోయి
నువ్వొస్తావని వేచివున్న ఇల్లాలి పసుపుతాళి ఏ గాలి వీస్తున్నా ఉలికి పడ్డదోయి
విలువైన అంతటి త్యాగాలు బలిచేసి కొందరి స్వార్ద్ధాలు
అతడు:
దేశాన్ని తగలెడుతూ వుంటే కొంపకే పొగపెడుతూ వుంటే
ఆమె:
క్షమిస్తే తప్పుసోదరా సమాజపు ముప్పుచూడరా
ప్రమాదం ముందులేదురా తుపాకీ దిశను మార్చరా
లోని శత్రువును పోల్చి చీల్చి పారెయ్యరా ఓ..ఓ..
అతడు & కోరస్:
పారా హుషార్ భాయీ - భద్రం సుమా సిపాయీ ||2||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
1999 అఫ్జా Award Winner!
.
Awesome! Follow the complete lyrics.
…
[Also refer to Pages 126-127 in సిరివెన్నెల తరంగాలు & pages 62-64 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………… |
|
No Comments »