Posted by admin on 4th June 2010 in
డబ్బు
|
Context
Song Context:
పాపాయిలా ఈ రూపాయలన్ని ఎట్టా పెంచాలి? |
Song Lyrics
||ప|| |అతడు|
అమ్మనీ ఫాదలో అబ్బనీ ఎంత దెబ్బనీ అబ్బనీ ఎంత దెబ్బనీ
పిల్లతో పాటుగా ఒళ్ళోకి వచ్చింది ఒక్కదెబ్బనీ ఫాదలు ఓహో ఫాదలు
అతడు1 :
సన్ను అమ్మనీ ఎంత సొమ్మనీ అమ్మనీ ఎంత సొమ్మనీ
నక్కతోక తొక్కినట్టు అప్పనంగ దక్కిందే అందుకొమ్మని సన్ను ఒరే సన్ను
అతడు:
పాపాయిలా ఈ లూపాయలన్ని ఎట్టా పెంచాలి ఫాదలు
అతడు1:
అహా! లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ను
అతడు:
ఫాదలు ఓహో ఫాదలు
అతడు:
సన్ను సరే సన్ను
.
చరణం: అతడు:
భలే ఇడియా ఫాదలు
అతడు1:
ఎందది
అతడు:
ఎందంటె ఎలక్షన్లలో పెడదామా అసెంబ్లీకి ఎసరెడదామా ఫాదలు ఓహో ఫాదలు
ప్రజలకి టోపి వేద్దామా ఎడా పెడా దోచేద్దామా ఫాదలు ఫాదలు
అతడు1:
అసెంబ్లీలు మినస్టరీలు మూన్నాళ్ళేరా సన్ను
అతడు: అంతేనా
అతడు1 :
పవరు పోయినాక పాలేరైనా పలకరించడుర నిన్ను
పాలిటిక్సులో ఎముందిరా బంకమన్ను
అతడు:
అమ్మో అయితే వద్దు ఫాదలో ఇంకో బిజినెస్ చూడు ఫాదలు
|| లోపాయికరి||
.
చరణం: అతడు1:
నాకు వచ్చిందిరోయ్
అతడు1:
ఐడియా ఫిలిం ఫీల్డ్లో పెడదామా ప్రొడ్యూసర్లము అవుదామా సన్ను ఒరె సన్ను
లో బడ్జెత్లో తీద్దామా సబ్సీడులు కొట్టేద్దామా సన్నుఒరే సన్ను
అతడు:
లో బడ్జెత్లో ఆల్టుబొమ్మలు ఎవలు చూడలు ఫాదలు
అతడు1: డబ్బా
అతడు:
పోనీ బాలీ సినీమా తీస్తే ఫ్లాపయితేనో ఫాదలు ఫాదలు
పకీరులు అయి పడిపోమా నడీదిలో
అతడు1:
అమ్మో అయితే వద్దులా సన్ను ఇంకో బిజినెస్స్ చూడరా
||లోపాయికారి||
.
చరణం: అతడు:
మట్కాజూదం మించిన చిట్కా ఉంటుంది ఫాదలు
అతడు1:
మక్కెలు విరిగి బొక్కలో పడే రిస్కుంటుందిర సన్ను
అతడు: వద్లులోయ్ ఫాదలోయ్
అతడు1:
పేకాట క్లబ్బును పెడితే అంతా పైకమే కదా సన్ను
అతడు:
వచ్చినోల్లతో మనమే ఆడి నష్టపోతాము ఫాదలు
ఆ సారా కొట్టో బాలో అయితే
అతడు1:
బాలు బెల్టు కాదురా బాలు ఛి ఛి బారు రూ .
అతడు:
అదే లే ఫాదలు బాలు బాలెట్టడం బలే ఇడియా ఫాదలు
అతడు1:
ఆపాల సరకు మనకే చాలదు అమ్మకం ఎట్టా నన్ను
అతడు:ఆ విది యా
అతడు1:
లక్కు తిన్నగా లేదంటె బొక్క బోర్ల పడిపోతాము పళ్ళు ఊడగొట్టుకుంటాము
అతడు: అంతేనా ఫాదలు
అతడు1: అంతేరా సన్ను
అతడు: ఫాదలు
అతడు1:అంతే
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »