Archive for the ‘ఆహ్వానం మా ఇంటికి’ Category

రుద్రవీణ: రండి రండి రండి దయచేయండి

Posted by admin on 1st January 2010 in ఆహ్వానం మా ఇంటికి

Audio Song:
Movie Name
RudraVeena
Song Singers
S.P. Balu,
S.P. Sailaja,
Mano,
S. Janaki
Music Director
Ilaya Raja
Year Released
1988
Actors
Chiranjeevi,
Shobhana
Director
K. Balachander
Producer
K. Nagendra Babu

Context

Song Context:
ఆహ్వానం మా ఇంటికి: రండి రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి

Song Lyrics

పల్లవి:
అతడు1:
రండి రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి || రండి ||
ఆమె1:
నే చెప్పాగా నాన్నగారి తీరు
ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని ఉషారు
పలకరిపుతోటే మనసుమీటగలరు
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు
.
అతడు1:
తమరేనా సూర్య ఇలా కూర్చోండయ్యా
ఆగండి ఆగండి ఆగండి వద్దు కూర్చోకండి అక్కడ
తగిన చోటుకాదిది తమబోటి వారికి ఇక్కడ
ఆమె1:
ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్యా
గడపదాటి ఇటువస్తే వారి పేరు స్వరాలయ్య
అతడు1:
క్లయింట్లు కంప్లైంట్లు క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు
తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు
అతడు1:
రండి రండి రండి రండి దయచేయండి
ఆమె1:
తమరి రాక మాకెంతో సంతోషంసుమండి
.
అతడు1:
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటు || 2 ||
చిర్రుబుర్రులాడటం కుర్చీలకు ఆచారం
ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం
వచ్చిన మిత్రులకోసం ముచ్చటగా వుంటుందని
సంగీతం పలికించే స్ట్రింగులతో చేయించా
కచేరిలు చేసే కుర్చియిది ఎలావుంది
అతడు2:
బావుందండి
అతడు1:
గానకళ ఇలవేల్పుగా వున్న మాఇంట
శునకమైన పలుకు కనకాంగి రాగాన
ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ
గాలైన కదలాడు సరిగమల త్రోవ
.
రావోయి రా, ఇదిగో ఈయనే సూర్య ఈమె నా భార్య
ఈ యింటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సు
ఆర్గుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సు
ఆమె2:
చాలులెండి సరసం యేళ్ళు ముదురుతున్న కొద్ది
అతడు1:
తిడితే తిట్టేవు కాని తాళంలో తిట్టు
తకతొం తకిటతొం తరికిటతొం తకతకిటతొం
స్వరాలయ్య సంప్రదాయ కీర్తి నిలబెట్టు
ఆమె2:
పెడతా పొపెడతా పొగపెడతా ఉడకపెడతా
కొత్తవాళ్ళ ముందేంటీ వేళాకోళం - ఎవరేమనుకుంటారో తెలియని మేళం
ఆమె1:
ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన
సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన
ఆమె2:
రండి రండి రండి రండి దయచేయండి
అందరు:
తరమరి రాక మాకెంతో సంతోషంసుమండి
అతడు1:
వృద్ధాప్యంతో మంచంబట్టి తాళంతప్పక దగ్గడమన్నది
అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్య
ఖళ్ళు ఖళ్ళున వచ్చె చప్పుడు - ఘల్లు ఘల్లున మార్చే విద్య
కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడలమధ్య
ఆమె1:
ఇదిగో మా పనమ్మాయి దీని పేరు పల్లవి
అతడు1:
దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం
మా ఇంట్లో సందడికి ఈపిల్లే మరి పల్లవి
ఆమె3:
రండి రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషంసుమండీ
అతడు3:
పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్
వావిలాల వరాలయ్య బి.ఎ.ఎల్.ఎల్.బి. పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్
అతడు1:
మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు
అడుగుపెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు
రండి రండి రండి రండి రండి రండి రండి రండి
ఆమె1:
మాకు నిలయ విద్వాంసులు చిలకరాజుగారు
కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరు
అతడు1:
నవ్వు మువ్వకట్టి ప్రతినిముషాన్నీ తుళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ
ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్ధం - అదే అదే నా సిధ్ధాంతం
అతడు2:
గానమంటే ఒక కళగానే తెలుసు ఇన్నాళ్ళు నాకు
బ్రతుకు పాటగా మార్చినందుకు జోహారు ఇదిగో మీకు
“సంగీతంలో పాడతారనే అనుకున్నా ఇన్నాళ్ళు… సంగీతంలో మాటలాడటం……
మాటలనే సంగతులు చెయ్యడం - సంగతులే సద్గతులు అనుకొనడం
సరిగా తెలుసుకున్నాను ఈనాడు
సెలవిప్పిస్తే వెళ్ళొస్తా - మళ్ళీ మళ్ళీ వస్తూవుంటా
.
.
(Contributed by Pradeep)

Highlights

[Also refer to pages 41-42 in సిరివెన్నెల తరంగాలు]
…………………………………………………………………………………………….