|
Context
Song Context:
నీ చల్లనైన నీడ మా పాలరాతి మేడ నీ మాటె మాకు వేదమనుకుంటాం!
మమ్మేలు మారాజా! |
Song Lyrics
కోరస్:
అంగరంగ వైభవంగ సంబరాలు చెయ్యరండి స్వాగతాలు చెప్పడానికి
వెయ్యి వందనాలు చెయ్యరండి చందనాలు చల్లరండి అందమైన అయ్యగారికి
మన వంశమేలు వారసుడికి
.
పల్లవి:
అతడు: దండాలండి కొత్త దొరగారికి కోరస్: జయహో … ఓ…ఓ
అతడు: విచ్చేయండి కోటనేలడానికి కోరస్: జయహో … ఓ…ఓ
అతడు:
వెలుగై వస్తివే మా కళ్ళవిందు చెయ్యడానికి
కన్నులే చాలవే నీ రాచ ఠీవి చూడడానికి
||దండాలండి||
.
చరణం: ఆమె:
ఆజ ఆజా బాలరాజా ఉదయించే భానుతేజా
మంచి కాలం కలిసి వచ్చి నువ్వే నడిచి వత్తె రాజ్యం నీది కాదా
అతడు:
జరిపిస్తాం పూల పూజ వినిపిస్తాం ఢోలు బాజా
ప్రతిరోజు పండుగ అనిపించే సందడి ఇంక నేడే మొదలు కాదా
ఆమె:
అందాల రాముడమ్మ అయోధ్య చేరెనమ్మ పట్టాభిషేకమింక కనరమ్మా
కోరస్: అంటారింక ప్రతివారు
||దండాలండి||
.
చరణం: అతడు:
చిటికేస్తే చాలు అంటాం చిత్తమంటూ సిద్ధమవుతాం
నువ్వు మెచ్చే సేవల్ని చేస్తూ నచ్చే విధంగ ఉంటూ నిత్యం నిన్నంటి ఉంటాం
ఆమె:
ఆకలేస్తే పసిడి కంచం ఆవులిస్తే పందిరి మంచం
నీకు ఇట్టె అమర్చి పెట్టి అదే మా భాగ్యమంటు భక్తే చాటించుకుంటాం
అతడు:
నీ చల్లనైన నీడ మా పాలరాతి మేడ నీ మాటె మాకు వేదమనుకుంటాం
కోరస్: మమ్మేలు మారాజా
||దండాలండి||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »