|
Context
Song Context:
నీ అల్లర్లు అందం నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె నీ నేస్తమే మంచి గంధం!
|
Song Lyrics
పల్లవి: ఆమె:
కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ
వాన మబ్బు లాంటి వాటం నీదయా
అతడు:
నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీదయా
ఆమె:
నీ అల్లర్లు అందం నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించె నీ నేస్తమే మంచి గంధం
||కోపం||
.
చరణం: అతడు:
చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవటా
ఆమె:
మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదొకటే పేర్లే వేరటా
అతడు:
ఔనో కాదో తెలియదు కాని
నువ్వు చెబుతుంటే ఔనంట
ఆమె:
మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా
అతడు:
నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంటా
నిన్ను నమ్మినాను అంతా నీ దయ
.
చరణం: ఆమె:
నిండు కుండ కాదు కనక తొణుకుతుందది
అంత వింత అందులోన ఏమిటున్నది
అతడు:
నాలో తెలివికి దీన్లో నీటికి
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నది
ఆమె:
అమృతం లాంటి హృదయం నీది
అంతకన్న వేరే వరమేది
అతడు:
అది తెలిసి కూడ కసురుకుంటె నేరమెవరిది
||కోపం||
.
.
(Contributed by Prabha) |
Highlights
చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవటా!
.
మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదొకటే పేర్లే వేరటా!
……………………………………………………………………………………………….. |
|
No Comments »