|
Context
Song Context:
నిన్నే నువ్వు వెతికావేమో తెలుసా ఓ మనసా నీకైనా!
A love song! |
Song Lyrics
||ప|| |అతడు|
చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే
ఏమో ఏమైందో ఏమి అర్థం కాకుందే
నిద్దర్లో నడక ఇదేమో
నిన్నే నువ్వు వెతికావేమో తెలుసా ఓ మనసా నీకైనా
మబ్బుల్లో తెగ ఎగిరావో మైకంలో మునిగున్నావో
చెప్పారా నీతోటి ఎవరైనా
ప్రేమ ఓ ప్రేమ చూపావే నీ మహిమ
ప్రేమ ఓ ప్రేమ నిన్నాపెదెవరమ్మా
||చూస్తూ చూస్తూనే ||
.
||చ|| |అతడు|
తలపుల్లో జడివానలకు తలపై ఎందుకు ఈ గొడుగు
చెలియా నీ మెత్తని అడుగు నా గుండెల్లో చలి పిడుగు
ప్రతి నిజమూ కలలాగే ఉందీ అంది మేలుకుని కలలు కనే నయనం
నా చుట్టూ లోకం ఏమైంది అందీ ప్రతి చోట నిను చూపే హృదయం
చూపుల్లో నిన్నే నిలిపి ఊహకు నీ దారే తెలిపి పదపదమని పరిగెత్తిస్తున్నా
నా పేరుని నేనే చెరిపి నా ఆశలు నీలో కలిపి నీ కోసం పడి చస్తున్నా
ప్రేమ ఓ ప్రేమ చూపావే నీ మహిమ
ప్రేమ ఓ ప్రేమ నిన్నాపెదెవరమ్మా
||చూస్తూ చూస్తూనే ||
.
||చ|| |అతడు|
నువ్వొచ్చీ నేర్పేవరకు పాదాలకు తెలియదు పరుగు
నువ్విచ్చిందే ఈ వెలుగు ఇన్నాళ్లకు నా కన్నులకు
నాక్కూడా కన్నీరొస్తుంది అంది నా చెంపను నిమిరే నీ స్నేహం
బతకడమూ బాగానే ఉంది అంది నీ జతలో నవ్వే నా ప్రాణం
శ్వాసకి ఈ పూల సుగంధం పెదవికి చిరునవ్వుల అర్థం
నీ చెలిమే తెలిపిందనుకోనా
సరికొత్తగా నీ అనుబంధం సృష్టించిన నా ఈ జన్మం నీదై నే జీవిస్తూ ఉన్నా
ప్రేమ ఓ ప్రేమ చూపావే నీ మహిమ
ప్రేమ ఓ ప్రేమ నిన్నాపెదెవరమ్మా
||చూస్తూ చూస్తూనే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »