Archive for the ‘పైసా ఉంటే పరిగెత్తుకు రాడా పరమాత్మయినా’ Category

క్షణ క్షణం: కింగ్ లా కనిపిస్తున్నాడు

Audio Song:
Video Song:
Movie Name
Kshana Kshanam
Singers
S.P. Balu, Sridevi, Rikki
Music Director
M.M. Keeravani
Year Released
1991
Actors
Venkatesh, Sridevi
Director
Ram Gopal Varma
Producer
K.L. Narayana,
Lakshmana Choudhary

Context

Song Context: రాజైనా రారాజైనా మనీ ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే!

Song Lyrics

||ప|| |ఆమె|
కింగ్ లా కనిపిస్తున్నాడు…
మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా
|అతడు|
రాజైనా రారాజైనా మనీ ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే
పైసా ఉంటే పరిగెత్తుకు రాడా పరమాత్మయినా
కో అంటే కోటి దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి
|ఖోరస్|
తందత్తరదా తందత్తరదా తందత్తరదా తందత్తరదా తందత్తరదా
.
||చ|| |ఆమె|
ఓయబ్బో మయసభలా యమాగా ఉంది ఏమి మాయలోకమిది
|అతడు|
అచ్చ తెలుగులో ఐదు తారల పూటకూళ్ల ఇల్లు
మేకప్పేసి మరో భాషలో ఫైవ్ స్టార్ హోటల్ అంటారు
|ఆమె|
ఛా
|Receptionist|
Yes, Do you have any reservation?
|ఆమె|
అయ్యయ్యో లేదే
|Receptionist|
Welcome Sir! Welcome lady!
We are glad to have you here!
To serve you is our pleasure!
|ఆమె|
రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్లైనా దేవుల్లాడే అంత మహత్యం ఏముంది?
|అతడు|
శ్రీ లక్ష్మీ దేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం
“ఎవరక్కడ?” అంటే “చిత్తం!!” అంటుంది లోకం మొత్తం
చెక్కంటారు దీన్ని
|Receptionist| checked in, Sir
                           || కో అంటే కోటి || |ఖోరస్| |అతడు|
.
||చ|| |ఆమె|
వావ్! అయ్యయ్యో! I can’t believe it!
అయ్ బాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది
|అతడు|
పైసాలో పవర్ ఇది పన్నీటి షవర్ ఇది
కాసు ముందు గాలైనా కండిషన్లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది
మబ్బులతో పరుపులు కుట్టి పాలనురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ
|ఆమె|
తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
|అతడు|
తందత్తరదాదా తందత్తరదా
|ఆమె, అతడు|
తందత్తరదాదా తందత్తరదా
.
.
(Contributed by Nagarjuna)

Highlights

What money can do, with narrative example of how one with money gets treated in a five star hotel
……………………………………………………………………………………………….