|
Context
Song Context:
సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే!
నీ గుండెలో గోదావరి నేర్పాలి ఎదురీతని!
నీ కళ్లలో దీపావళి ఆపాలి ఎద కోతని! |
Song Lyrics
||ప|| |ఆమె|
సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకే
మా కంటి చలువా కోనేటి కలువా కన్నీటి కొలువెందుకే
నడి రేయి జాములో తడి లేని సీమలో
|| సూరీడు ||
.
||చ|| |ఆమె|
బతుకే బరువూ ఈ నేలకీ - కరుణే కరువూ ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకీ - శ్వాసే చేదు ఈ గాలికీ
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికీ
ఆ శూన్యమే తోడున్నది ఈ చిన్ని ప్రాణానికీ
నిదురించెనే నీ తూరుపు నిట్టూరుపే ఓదారుపు
అందాల చిలకా అపరంజి మొలకా అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునకా కలలన్ని కరిగించగా
.
||చ|| |ఆమె|
ఏ వైపుందో ఏమో మరి జాడే లేదే దారీ దరి
ఏమవుతుందో నీ ఊపిరి వేటాడిందే కాలం మరి
నీ గుండెలో గోదావరి నేర్పాలి ఎదురీతని
నీ కళ్లలో దీపావళి ఆపాలి ఎద కోతని
పరుగాపనీ పాదాలతో కొనసాగనీ నీ యాత్రని
శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనమెన్నాళ్లయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల ఉన్నావయా
ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా
శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా ఈ మౌనమెన్నాళ్లయా
అల వైకుంఠాన అంతఃపురాన ఏ మూల ఉన్నావయా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »