| 
 | 
 Context 
Song Context: 
Her lover is leaving the country, becuase he gave up that she is going to express her love to him! However she is also going through the same struggle!   | 
 
| 
 Song Lyrics 
||ప|| |ఆమె| 
       ప్రతీ నిజం పగటి కలగా 
       నిరాశగా నిలవనా 
       ప్రతీ క్షణం కలత పడగా 
       నిరీక్షగా గడపనా 
       కన్నీటి సంద్రంలో నావనై 
       ఎన్నాళ్లీ ఎదురీత 
       ఏనాడూ ఏ తీరం 
       ఎదుట కనపడక 
                   ||ప్రతీ నిజం|| 
. 
||చ|| |ఆమె| 
       పెదవులు మరిచిన చిరునగవై 
       నిను రమ్మని పిలిచానా 
       వెతకని వెలుగుల పరిచయమై 
       వరమిమ్మని అడిగానా 
       నిదరపోయే ఎదను లేపి 
       నిశిని చూపించగా 
       ఆశలు చాచిన దోసిట శూన్యం నింపీ 
       కరగకుమా నా కన్నులనే వెలివేసీ 
                   ||ప్రతీ నిజం|| 
. 
||చ|| |ఆమె| 
       ఎక్కడ నువ్వని దిక్కులలో 
       నిను వెతికిన నా కేక 
       శిలలను తాకిన ప్రతిధ్వనిగా 
       నను చేరితే ఒంటరిగా 
       సగములోనే అలసిపోయే పయనమయ్యాగా 
       ఇసుకలో చేసిన సంతకమా నీ స్నేహం 
       ఏ అల నిను చెరిపిందో తెలుపదు కాలం 
. 
. 
         (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
……………………………………………………………………………………………….. 
 | 
 
 
 | 
					
				 
				  No Comments »