|
Context
Song Context:
తలపంతా తలవంచింది కళ్ల ముందు ఆమె నిలిచి ఉంటే! |
Song Lyrics
||ప|| |అతడు|
ఝల్లుమనదా హృదయం తుళ్లిపడదా సమయం
నమ్మగలదా నయనం నయగారమా
నువ్వేనా ? నువ్వనుకున్నానా?
నిజమేనా? ఊహలో ఉన్నానా?
||ఝల్లుమనదా||
.
||చ|||ఆమె|
ఐతే నా కోసం ఒక కవిత చెప్పు
|అతడు|
ఏ కవిత చెప్పను?
ఆ..స్వరము నీవై
|ఆమె| ఊహూ..తరవాత… |అతడు| స్వరమున పదము నేనై..
|ఆమె| ఊహూ..అలాగా |అతడు| రాగం గీతం కాగా…
|ఆమె|
ఇది ఆకలి రాజ్యం కాదా?
.
||చ|| |అతడు|
ఎన్ని వేల పలవరింతలో విన్నవించుకున్నాక
నన్నీ వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ ||2||
ఈ సత్యం స్వప్నంలా కరిగే దాకా
మైమరుపే ఆపాలా నిద్దుర లాగా
సందేహం పోతుందేమో నన్ను నేను గిల్లి చూసుకుంటే
||ఝల్లుమనదా||
.
||చ|| |అతడు|
ఆశలెపుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో
కాంక్షలెపుడు కుంచె కుదుపులై ఆమె లాగా మారాయో ||2||
చెలి శిల్పం మలిచిందీ మనసే అయినా
ఇంతందం తెలిసిందా తనకెపుడైనా
తలపంతా తలవంచింది కళ్ల ముందు ఆమె నిలిచి ఉంటే
||ఝల్లుమనదా ||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »