| 
 | 
 Context 
Song Context: 
    ఈ భావమే భాషలో చెప్పాలి? (A love song)  | 
 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       నన్నే ప్రేమించింది నేను ప్రేమించే చెలి 
|ఆమె| 
       నువ్వే కావాలంది నువ్వు కోరే కోమలి |2| 
|అతడు| 
       నా మౌనమే నీ పెదవిపై వాలి పాడిందిగా కవ్వాలి 
|ఆమె| 
       నీ ప్రణయమే తెలిపింది ఈగాలి కాదని ఎలా అనాలి 
|అతడు| 
      లోకానికి కబురెలా చేరాలి? 
. 
||చ|||అతడు| 
       నన్ను నాజూగ్గా నమిలి నాట్యమాడావే నెమలి 
       స్వప్న సీమల్ని వదిలి భామల్లే కదిలి ఎదురైందే తుది మజిలీ 
|ఆమె| 
       కన్నె సిగ్గంతా రగిలి కందిపోయింది చెక్కిలి 
       మగ మోహాన మొగిలి మదిలోన తగిలి మొదలైంది మధురవళి 
|అతడు| 
       మల్లె తీగా నువ్వొప్పుకుంటే సున్నితంగా చుట్టేసుకోనా 
|ఆమె| 
       పంజరంలా నువ్వు కోరుకుంటే పావురంలా కొలువుండిపోనా 
       ఈ భావమే భాషలో చెప్పాలి? 
. 
||చ|||అతడు| 
       కొన్ని కోలారు గనులు కోహినూరంటి మణులు 
       నీ కొనగోటి విలువ కనిపెట్టగలవా కొనలేని ఐశ్వర్యమా 
|ఆమె| 
       నిన్ను అడిగానా అసలు రంగు రాళ్లంటి సిరులు 
       ఈ కోనేటి కలువ కోరేటి చలువా నీ స్నేహమే చంద్రుడా 
|అతడు| 
       రాణిలాగా నన్నేలుకోగా నీ కోట కానియ్ నా కౌగిలింత 
|ఆమె| 
       నీ ప్రేమనంతా ఐదోతనంగా నా నోములన్నీ పండించుకుంటా 
       నా మనసెలా నీకు చూపించాలి? 
. 
. 
                       (Contributed by Prabha)  | 
 
| 
 Highlights 
………………………………………………………………………………………………..  | 
 
 
 | 
					
				 
				  No Comments »