|
Context
Song Context:
నడిరాతిరి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు! |
Song Lyrics
||ప|| |అతడు|
రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా ||2||
నా పెదవుల చిరునవ్వా నిను ఎక్కడ వెతికేదమ్మా
తిరిగొచ్చే దారే మరిచావా ఇకనైనా గూటికి రావా ||2||
.
||చ|| |అతడు|
వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంతా
పంపించానే అది ఏ చోట నిను తాకనే లేదా
పూచే పూవుల నిండా మన తీయని జ్ఞాపకమంతా
నిలిపుంచానే నువ్వు ఏ పూటా చూడనే లేదా
నీ జాడను చూపించంటూ ఉబికేనా ఈ కన్నీరు
ఏ నాడు ఇలపై పడి ఇంకిపోలేదూ
నడిరాతిరి ఆకాశంలో నక్షత్రాలను చూడు
అవి నీకై వెలిగే నా చూపుల దీపాలు
ఆ దారిని తూరుపువై రావా నా గుండెకు ఓ క…
||రివ్వున ఎగిరే గువ్వా||
.
||చ|| |అతడు|
కిన్నెరసాని నడక నీకెందుకే అంతటి అలక
నన్నొదిలేస్తావా కడదాక తోడై రాక
బతుకే బరువై పోగా మిగిలున్నా ఒంటరి శిలగా
మన బాసలు ఊసులు అన్ని కరిగాయా ఆ కలగా
ఎన్నెన్నో జన్మలదాక ముడివేసిన మన అనుభంధం
తెగి పోయిందంటే నమ్మదుగా నా ప్రాణం
ఆయువుతో ఉన్నది అంటే ఇంకా ఈ నాదేహం
క్షేమంగా ఉన్నట్టే తనకూడా నాస్నేహం
ఎడబాటే వారధిగా చేస్తా త్వరలోనే నీ జతగా వస్తా
||రివ్వున ఎగిరే గువ్వా||
.
.
(Contributed by Priyanka) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »