Archive for the ‘సీతారాముల కల్యాణం విశిష్టత’ Category

గౌరి: ఏనాడో జరిగినా ఎన్నాళ్లో గడిచినా ఏటేటా కొత్తగా కళ్యాణమా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gowri
Song Singers
   Mano,
   Chorus
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Sumanth,
   Charmee
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
     పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారక మంత్రం!

Song Lyrics

|సాకీ|
       వరమాలై నీ మెడలోనా వాలిన జానకి ప్రేమా..ప్రేమా
       మెరుపల్లే నీ మేనంతా అల్లెను మేఘశ్యామా
       రామా రామా రామా..రామా రామా రామా
.
||చ|| |అతడు|
       ఏనాడో జరిగినా ఎన్నాళ్లో గడిచినా
                 ఏటేటా కొత్తగా కళ్యాణమా
       విల్లును విరిచావనా పిల్లను గెలిచావనా
                 ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా
       కాపురమంతా కారడవిగా జీవితమంతా కష్టాలుగా
       చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్థం
       పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారక మంత్రం
|ఖోరస్|
       విన్నకొద్దీ వింతలెన్నో తెలుపుతున్నది
       కళ్ల నిండ కాంతులెన్నో నింపుతున్నది
       ఊరువాడునల్లుకున్న పందిరే ఇదీ
       మన్ను మిన్ను ఏకమైన సందడే ఇది
                               ||ఏనాడో ||
.
||చ|| |ఖోరస్|
       ముడేమన్నాడోయ్ సీతారాముడేమన్నాడోయ్ || 2 ||
|అతడు|
       త్యాగం నిలిచిందయ్యా రఘురామా నీ మూర్తిగా
       న్యాయం గెలిచిందయ్యా శుభనామా నీ కీర్తిగా
       మమతకి లక్ష్మణ భరతులు తమ్ముళ్లనీ
       మంచి మనసుకంతా బంధువులేననీ
       ఇలా విలువలెన్నో లోకానికీ తెలియజెబుతుందా అందరి పెళ్ళి
|ఖోరస్|
       అందుకే నేటికీ తలచుకుంటాం మళ్ళీ మళ్ళీ
|ఖోరస్|
       పెళ్లి ఈడు పడుచులంత జానకమ్మలై
       జంట కోరు పురుషులతో రామభద్రులై
       వీధి వీధి పచ్చమేను పెళ్లి పందిరే
       ఆలుమగలు ఎవరైనా పెళ్లి పెద్దలే
                                ||ఏనాడో ||
.
||చ|| |అతడు|
       బంధం బిగువింతనీ ఎడబాటే తెలిపిందయా
       నేస్తం బలమింతని కపిసైన్యం చూపిందయా
       సముద్రాన్ని లంఘించే హనుమ భక్తిని
       అధర్మాన్ని దండించే ధర్మ శక్తిని 
       నిరూపించింది అడవికెళ్లి జగత్కళ్యాణం జరిపిన పెళ్ళి
|ఖోరస్|
       మనిషిలో మహిమనీ కొలుచుకుంటాం గుళ్ళోకెళ్ళి
|ఖోరస్|
       విన్నకొద్దీ వింతలెన్నో తెలుపుతున్నది
       కళ్ల నిండ కాంతులెన్నో నింపుతున్నది
       ఊరువాడునల్లుకున్న పందిరే ఇదీ
       మన్ను మిన్ను ఏకమైన సందడే ఇది
       రామా..శ్రీ రామా…రామా…
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

Also do not miss Sirivennela gaaru on video on the left with explanation of this brilliant song.
…………………………………………………………………………………………………