|
Context
Song Context:
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
|ఆమె|
తకధిమి తాళాలపై తళుకుళ తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్నీ
.
||చ|| |ఆమె|
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
|అతడు|
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
|ఆమె|
మా కళ్లలో వెలిగించవే సిరివెన్నెలా
|అతడు|
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగేవేళ
|ఆమె|
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ
|| ఉరుములు ||
.
||చ|| |అతడు|
నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
|ఆమె|
నీ పెదవే తనకోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
|అతడు|
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా…..
|ఆమె|
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
|అతడు|
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ
|| ఉరుములు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »