|
Context
Song Context:
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది!
తెలివిగా వెయ్రా పాచిక కల్లో మేనక ఒళ్లో పడగా
సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగి దాక నిచ్చెనేద్దాం ఎక్కి చూద్దాం!
|
Song Lyrics
||ప|| |అతడు|
సాహసమే చేయ్రా డింభకా అన్నది కదరా పాతాళ భైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహా దక్కుతుంది అహహా రాకుమారి
తెలివిగా వెయ్రా పాచిక కల్లో మేనక ఒళ్లో పడగా
సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగి దాక నిచ్చెనేద్దాం అహహహా…ఎక్కి చూద్దాం అహహహా ఒహొహొ….
.
||చ|| |అతడు|
చందమామను అందుకుని ఇంద్రభవనాన్ని కడతానురా
పడవంత కారులోనే బజారులన్నిషికారు చేస్తానురా
సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా
అపుడు అప్సరసలు ఎదురొచ్చి కన్ను కొడతానురా
చిటికేస్తే అహహహా సుఖమంతా అహహహా మనదేరా
||సాహసమే చేయ్రా ||
.
||చ|| |అతడు|
సున్నిఉండలు కందిపొడి ఫేక్టరీల్లోన వండిచనీ
అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారని
కొన్ని MPలను కొంటా కొత్త PMని నేనేనంటా
స్కాం లెన్నో చేసి స్విస్ బేంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే అహహహా ఎవడైనా అహహహా సూపర్ స్టారే
||సాహసమే చేయ్రా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »