|
Context
Song Context:
పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా!
పంచదార వలపు పెట్టి పెంచమందిరా!
|
Song Lyrics
|ఆడ కోరస్|
ఎర్రా ఎర్రాని చూపు ఎంటాడెనమ్మా — చుర్రు చుర్రూన కైపు చిర్రెత్తనమ్మా
|మగ కోరస్|
ఎర్రా ఎర్రాని రూపు ఎదురొచ్చేనమ్మా — చుర్రు చుర్రూన కైపు కిర్రెక్కెనమ్మా
అతడు:
పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచమందిరా
|కోరస్| ||పంచవన్నెల||
.
అతడు:
ముచ్చటైన ఊసువుంది మొక్కజొన్న తోటకాడ
వచ్చిపోయే ఒక్కసారి వాటమైన సందెకాడ
|కోరస్| ||ముచ్చటైన||
|కోరస్| ||పంచవన్నెల||
ఆమె:
పంచవన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా
పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా
అతడు:
కళ్ళముందు ఘల్లుమంటూ పిల్ల ఎంకి చిందులాడ
మబ్బుచాటు నుంచిరాడు చందురూడు తొంగిచూడ
అతడు: ||పంచవన్నెల||
.
చరణం: అతడు:
కన్నుకొట్టెరో కూనా కన్నుకొట్టేరో
కన్నుకొట్టి కుర్ర ఈడు వెన్నుతట్టేరో
ఆమె:
కన్నుకొట్టరా కన్నా కన్నుకొట్టరా
కన్నుకొట్టి కుర్రదాన్ని వెన్నుతట్టరా
అతడు:
రివ్వు రివ్వుమంటూ గువ్వ గుండెలోర వాలేనంటా
పువ్వులాగా చూసుకుంటే జంటవీడి వెళ్ళదంటా
కోరస్: ||రివ్వు||
ఆమె: ||పంచవన్నెల||
అతడు: ||పంచవన్నెల||
కోరస్:||పంచవన్నెల||
అతడు:||ముచ్చటైన||
ఆమె: ||పంచవన్నెల||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »