|
Context
Song Context:
వంద ఏళ్ల నీనిండు జీవితం గండి పడదనే నమ్మకమై
శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై
పరుగులు తీయ్! ఉరకలు వేయ్!
|
Song Lyrics
||ప|| |అతడు|
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర ||2||
దడదడ దడదడలాడే ఎద సడి ఢమరుకమై
వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై
పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై
దూసుకు వచ్చే మృత్యువుకందని మార్కండేయుడవై
||పరుగులు తీయ్||
.
చరణం: అతడు:
కుత్తుక కోసే కత్తి కొనలు… కత్తి కొనలు
కుత్తుక కోసే కత్తి కొనలు దరి దాపుకు చేరని దూకుడువై
ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్
మట్టిలోకి తన గిట్టలతో నిను తొక్కెయ్యాలని తరుముకువచ్చే
కాలాశ్వంపై స్వారీ చెయ్
||పరుగులు తీయ్||
.
చరణం: అతడు:
ఎడారి దారుల తడారి పోయిన ఆశకు చెమటల ధారలు పోయ్
నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్
వంద ఏళ్ల నీనిండు జీవితం గండి పడదనే నమ్మకమై
శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై
||పరుగులు తీయ్||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
ఎడారి దారుల తడారి పోయిన ఆశకు చెమటల ధారలు పోయ్ WoW!
.
పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై
దూసుకు వచ్చే మృత్యువుకందని మార్కండేయుడవై Awesome!
……………………………………………………………………………………………….. |
1 Comment »